వాడపాలెంలో ఛత్రపతి శివాజీ పట్టాభిషేక దినోత్సవం ఘనంగా జరిగింది

June 27, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు జూన్ 27 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) బీజేపీ సీనియర్ నాయకులు, ఆత్మ కమిటీ డైరెక్టర్ పాలాటి మాధవ స్వామి ఆధ్వర్యంలో వాడపాలెంలో ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్య దినోత్సవం నిర్వహించారు. ఇది శివాజీ మహారాజు పట్టాభిషేకం జరుపుకున్న రోజు.ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు *పాలూరి సత్యానందం పాల్గొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ ప్రసంగం ఆర్ఎస్ఎస్ కోనసీమ బౌద్ధ ప్రముఖ్ తోగరు ఆంజనేయులు మాట్లాడుతూ…శివాజీ పేరు హిందూ మతానికి ఉత్సాహం ఇస్తుందని,మొఘలుల దాడుల సమయంలో హిందూ మతం కనుమరుగవుతుందన్న వేళ శివాజీ మండే నిప్పు కణికలా వచ్చి పోరాడారని,హిందూ మతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందని అన్నారు.1674లో శివాజీకి చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగిందని గుర్తు చేశారు. మహారాష్ట్రలో దీన్ని పండుగలా జరుపుకుంటారని తెలిపారు.పాల్గొన్న ఇతర నాయకులు:
పెదపూడి బాపిరాజు, రాష్ట్ర యువ మోర్చా అధికార ప్రతినిధి పాలూరి జయ ప్రకాష్ నారాయణ, ఆత్మ కమిటీ డైరెక్టర్ మద్దం శెట్టి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గొల కోటి వెంకటేశ్వరావు, కోటిపల్లి రఘురామ్, సిద్ధంశెట్టి గంగారావు, సిద్ధంశెట్టి శంకర్, రేలంగి ఆంజనేయులు, సానబోయిన కొండలరావు తదితరులు.శివాజీ మహారాజు వీరత్వాన్ని, హిందూ స్వరాజ్య స్థాపనను గుర్తు చేసుకుంటూ కార్యక్రమం జరిగింది.

🌐 Select Language:
📰 ePaper