ఎరుగట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.

June 28, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.28.06.2026. నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఏరుగట్ల మండలం గ్రామం తాళ్ల రాంపూర్ పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం తాళ్ల రాంపూర్ గ్రామంలో అక్కడనే పుట్టిన పిల్లల నుండి ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించుకొని కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని భానుచందర్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమానికి ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తల్లిదండ్రులకు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మానికి తోడుపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాలక సభ్యులు డాక్టర్ రక్షిత హెచ్ ఇ ఓ మోతి రామ్ సూపర్వైజర్ విజయ హెల్త్ అసిస్టెంట్ పండరి గుండా మోహన్ ఏఎన్ఎం శ్యామల ఎంఎల్ హెచ్ పి శివ చరణ్య అంగన్వాడి అనురాధ కటకం గౌతమి ఆశ వర్కర్ మమత లావణ్య శారద

🌐 Select Language:
📰 ePaper