గెద్దనాపల్లి పంచాయతీ అభివృద్ధి అధికారి ఎంటివి వర్మ ఉద్యోగ విరమణ*

June 30, 2026 | సినిమా వార్తలు

పయ నించే సూర్యుడు జూన్ 30 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పంచాయతీ రాజ్ శాఖలో ఆరు దశాబ్దాల అంకితభావంతో, అనుభవంతో గ్రామీణాభివృద్ధికి సేవలందించిన గెద్దనాపల్లి కందికుప్ప నడవపల్లి పంచాయతీ అభివృద్ధి అధికారి ఎంటివి వర్మ ఈరోజు ఉద్యోగ విరమణ పొందారు.గ్రామీణాభివృద్ధికి నిజమైన మార్గదర్శిగా నిలిచిన వర్మ కార్యదీక్ష, దక్షత భవిష్యత్ తరాలకు ఒక గొప్ప పాఠం. ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాలను ఎంతో వినయంతో పాటిస్తూ, సహనంతో అందరితో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించిన తీరు అందరికీ ఆదర్శప్రాయం, ప్రశంసనీయం.గెద్దనాపల్లి పంచాయతీ అభివృద్ధికి ఆయన అందించిన విశిష్ట సేవలు ఎల్లప్పుడూ స్మరణీయం.ఈ సందర్భంగా శ్రీ ఎంటివి వర్మ వారి కి హార్దిక శుభాకాంక్షలు తెలియజేయడమైనది. వారి భావి జీవితం మరింత స్ఫూర్తిదాయకంగా, మరింత ఆనందమయంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల ఎంపీడీవో బి రాజేశ్వరరావు మరియు వారి సిబ్బంది

🌐 Select Language:
📰 ePaper