ద్రాక్షారామం అగ్నిబాధితులకు అండగా రైస్ మిల్లర్స్..రూ.7 లక్షల విరాళం అందజేత
పయ నించే సూర్యుడు జూన్ 30 (ప్రతినిధి గ్రంధి నానాజీ) మంత్రి సుభాష్ పిలుపునకు విశేష స్పందనడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం:*ద్రాక్షారామం మార్కెట్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాలకు అండగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపుకు స్పందించిన మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు మొత్తం రూ.7 లక్షల విరాళాన్ని మంత్రి సుభాష్‌కు అందజేశారు.అగ్నిప్రమాద బాధితులను ఆదుకునేందుకు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇప్పటికే రూ.20 లక్షల వ్యక్తిగత సహాయాన్ని ప్రకటించడంతో పాటు, సమాజంలోని దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మంత్రి విజ్ఞప్తికి విశేష స్పందన లభించగా, ఇప్పటికే మంత్రి సహాయంతో కలిపి సుమారు రూ.70 లక్షల మేర సహాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో మండపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రూ.2 లక్షలు, రామచంద్రపురం నియోజకవర్గ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించి, మొత్తం రూ.7 లక్షలను మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ కష్టకాలంలో అగ్నిబాధిత కుటుంబాలకు అండగా నిలిచిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకుల సేవాభావాన్ని అభినందించారు. బాధిత కుటుంబాల పునరావాసానికి ప్రభుత్వం, దాతలు, ప్రజల సహకారంతో అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు, చుండ్రు వివిఎస్ఎస్ చౌదరి, సత్తిరెడ్డి, వేపకాయల పెదబాబు, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.