పేదలకు పెన్నిధి సీఎం సహాయ నిధి

July 1, 2026 | తెలంగాణ

( పయనించే సూర్యుడు జులై 02 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )కొత్తూరు మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబటి ప్రభాకర్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఒక గొప్ప వరమని కొత్తూరు మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సీఎం రిలీఫ్‌ ఫండ్‌ లబ్ధిదారులకు బుధవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబటి ప్రభాకర్‌తో కలిసి ఆయన చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ… నియోజకవర్గ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక చొరవతో, వైద్య పరంగా ఆపదలో ఉండి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి సకాలంలో ఈ నిధులు అందుతున్నాయని తెలిపారు. లబ్ధిదారులందరూ ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత అంబటి ప్రభాకర్ మాట్లాడుతూ… ఎలాంటి రాజకీయ పార్టీల భేదం లేకుండా, కేవలం అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధులను అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper