రథసారథి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జనసేన మండల కార్యదర్శి స్వరూప్
పయనించే సూర్యుడు జూలై 2 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా వరదాయిపాలెం మండలంలో జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రథసారథి సభ్యత్వ నమోదు కార్యక్రమం”**ను మండల కార్యదర్శి స్వరూప్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారుఈ సందర్భంగా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రజలకు వివరించారు. యువత, మహిళలు, పార్టీ అభిమానులను పెద్ద ఎత్తున జనసేన పార్టీలో సభ్యులుగా నమోదు చేస్తూ రథసారథి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సభ్యత్వం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్వరూప్ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.