*పెదమడి సుధామయి విజయదుర్గ అమ్మవారికి ఆషాడ సారె*

July 17, 2026 | సినిమా వార్తలు

*శాకాంబరిగా అలంకరించి పంచామృత అభిషేకం*

పయనించే సూర్యుడు జూలై 17 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా*ఐ.పోలవరం మండలం, పెదమడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సుధామయి విజయదుర్గ అమ్మవారికి ఆషాడ మాసం సందర్భంగా సారె సమర్పించారు.గ్రామస్థులు, భక్తులు, ఊరి ఆడపడుచులు, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వాలంటీర్ల పర్యవేక్షణలో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు. పంచామృత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. మాతృమూర్తులు అమ్మవారికి కుంకుమార్చన చేశారు.అనంతరం పసుపు, కుంకుమ, గాజులు, చీర, రవికె, చలిమిడి, పానకం, వివిధ రకాల స్వీట్లు, పండ్లు, పిండి వంటలు అమ్మవారికి నివేదన చేశారు.ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రవచకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఆషాడ మాసంలో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించడం వల్ల పాడిపంటలు సమృద్ధిగా కలుగుతాయని, విపత్తుల నుండి రక్షణ లభిస్తుందని తెలిపారు. అమ్మవారిని ఊరి ఆడపడుచుగా భావించి ఆషాడ సారె సమర్పించడం మన ఆనవాయితీ అన్నారు.ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో చైతన్యం కలుగుతుందని, భక్తి భావం పెరుగు తుందన్నారు. మన ఆచార సంప్రదాయాలను తెలుసుకుని చిన్నతనం నుండే పిల్లలకు నేర్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దంతులూరి రాఘవరాజు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దంతులూరి చినవర్మరాజు, సానబోయిన రాంబాబు, దంతులూరి కృష్ణంరాజు, పాటి వీరన్నబాబు, గుత్తుల వెంకటేశ్వరావు, గుబ్బల శ్రీనివాసరావు, పాటి హరికృష్ణ, మేడిశెట్టి వెంకటేశ్వరావు, సానబోయిన వెంకటరమణ, పాటి కాశీవిశ్వేశ్వరరావు, కముజు గోపాలకృష్ణ, పేరాబత్తుల రామకృష్ణారావు, గుబ్బల నాగేంద్ర ప్రసాద్, మేడిశెట్టి నాని మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.కార్యక్రమం అంతా భక్తి శ్రద్ధలతో జరిగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు

🌐 Select Language:
📰 ePaper