ఎస్‌ఐఆర్ ప్రక్రియలో వేగం పెంచాలి*100 శాతం పూర్తి చేయాలి..

July 17, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.17.7.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డిప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భీంగల్ పట్టణం వెనుకబడిన నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి శుక్రవారం అత్యవసరంగా భీంగల్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ఈ సందర్భంగా పట్టణంలోని మొదటి వార్డుతో పాటు 171వ పోలింగ్ బూత్‌ను సందర్శించి, ఇంటింటికీ తిరుగుతూ కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. బూత్ స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలతో మాట్లాడి నమోదు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు.అనంతరం కాంగ్రెస్ నాయకులతో సమావేశ మైన నాగేష్ రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా పార్టీ శ్రేణులు చురుకుగా పనిచేయాలని సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలని, అవసరమైన దరఖాస్తులను పూర్తిచేయించి వంద శాతం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం లో ఓటు అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్న ఆయన, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా కాంగ్రెస్ నాయకులు, బూత్ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper