అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం జూలై 24
108EMRI సంస్థ ఆధ్వర్యంలోస్వీయ సంరక్షణ అవగాహన కార్యక్రమలు
:పయనించే సూర్యుడు జులై24 నారాయణపేట జిల్లా: అంతర్జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం జూలై 24న అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవంనిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా 108 EMRI గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ప్రజలకు స్వీయ సంరక్షణపై అవగాహన కల్పిస్తోంది. ఈ సందర్భంగాతెలంగాణ రాష్ట్ర 108 అంబులెన్స్ సేవల కార్యనిర్వాహణ అధికారి శ్రీ బి. సుధాకర్ గారు మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్య పరీక్షలు, మానసిక ప్రశాంతత వంటి అలవాట్లు గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి వ్యాధులను నివారించడంలో కీలకమని తెలిపారు.గుర్తుంచుకోండి: ఆరోగ్యకర మైన ఆహారం తీసుకోండి. రోజూ కనీసం 30 నిమిషాలు నడవండి.పొగాకు, మద్యానికి దూరంగా ఉండండి.క్రమం తప్పకుండా BP, షుగర్ పరీక్షలు చేయించుకోండి.ధ్యానం, తగినంత నిద్రకు ప్రాధాన్యం ఇవ్వండి.అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 108కు కాల్ చేయండి. సమయానికి వైద్య సేవలు పొందడం కూడా స్వీయ సంరక్షణలో ఒక ముఖ్యమైన భాగం.ప్రపంచ ఆరోగ్య సంరక్షణ వ్యూహాలలో స్వీయ సంరక్షణను ఒక కీలక అంశంగా ప్రోత్సహిస్తుంది స్వీయ సంరక్షణే ఆరోగ్యవంతమైన జీవితానికి మొదటి అడుగు అని అన్నారు.