PS Telugu News
Epaper

1996-97 పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజనాలు.

📅 10 Nov 2025 ⏱️ 4:35 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 10(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)

యాడికి మండల పరిధిలోని కోన రామలింగేశ్వర స్వామి సన్నిధిన సోమవారం 1996-97 విద్యా సంవత్సరంలో యాడికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు. కార్తీక మాస సోమవారం సందర్భంగా కోన క్షేత్రానికి వచ్చిన భక్తులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ప్రింటింగ్ ప్రెస్ నాగేష్, విజయ్ కుమార్, కాశీం ఎలక్ట్రానిక్ మహమ్మద్, శేఖర్ రెడ్డి, రామాంజి, అంజి, మురళి, వెంకటేష్, గిరి, చంద్రశేఖర్ రెడ్డి, తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Scroll to Top