కృష్ణా,భీమా నదులపై కర్ణాటక ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల పరిశీలనకు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు
( పయనించే సూర్యుడు జూలై 26 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )కృష్ణా,భీమా నదులపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను పరిశీలించేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా భారత రాష్ట్ర సమితి నాయకుల బృందం పర్యటనకు సిద్ధమైంది.మాజీ మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్,డాక్టర్ సి.లక్ష్మారెడ్డి,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి,మరియు ఇతర సీనియర్ ప్రజాప్రతినిధులతో కూడిన బృందం వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి మహ బూబ్ నగర్ నుండి బయలుదేరారు.