వామ్మో.. పగలంతా భక్తి ప్రవచనాలు.. రాత్రేమో కామ కేళీలు.. బయటపడ్డ మహిళా సన్యాసి బాగోతం (వీడియో చుడండి)
పయనించే సూర్యుడు న్యూస్ :- ఆమె కాషాయం కడుతుంది. మెడలో జపమాల ఉంటుంది. నుదుట సింధూరం ఉంటుంది. చూసేందుకు అందంగా ఉంటుంది. అటువంటి మహిళ సాద్వి గా మారింది.. భక్తి మాటలు.. నీతి వాక్యాలు చెప్పడం మొదలుపెట్టింది. తద్వారా అశేషమైన భక్త జనాన్ని కూడగట్టుకుంది. వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది. అటువంటి పేరు ఉన్న ఆమె ఇప్పుడు ఒక్కసారిగా మీడియాలో ప్రముఖమైన వ్యక్తి లాగా మారిపోయింది. కాకపోతే మంచి మాటలు ద్వారా కాదు.. ఆమె వ్యవహార శైలి ద్వారా వివాదాస్పదమైన మహిళగా రూపాంతరం చెందింది.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సాద్వి ప్రేమ్ బైసా ప్రవచనాలు చెబుతుంది. భక్తి మాటల ద్వారా విశేషమైన పేరు సంపాదించుకుంది. అటువంటి మహిళ ఇటీవల ఒక వీడియోలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. ఓ వ్యక్తి ఆమె ఉంటున్న గదిలోకి వచ్చాడు. అతడి కూడా కాషాయ దుస్తులు ధరించాడు. ఇంతలోనే ఓ మహిళ వచ్చి పడకను సర్దింది. ఆ తర్వాత ప్రేమ్ బైసా ఆ పడక మీద కూర్చుంది. అదే గదిలో ఉన్న వ్యక్తి ఆమెను గట్టిగా ఆ లింగనం చేసుకున్నాడు. రాయడానికి వీళ్లేని భాషలో చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో ఆ వీడియో కాస్త ఒకసారిగా సోషల్ మీడియాలో పడి సంచలనంగా మారింది. దీంతో సాద్వి పై విమర్శలు వ్యక్తమయ్యాయి. పగలేమో భక్తి మాటలు చెబుతూ.. రాత్రి ఇలాంటి వ్యవహారాలు సాగిస్తారా అంటూ.. ఇదేనా మీరు నేర్పే భక్తి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రముఖంగా ప్రసారం కావడంతో సాద్వి మీడియా ముందుకు వచ్చారు. ఒక స్వీయ వీడియో ద్వారా అసలు విషయాన్ని చెప్పారు..” ఆ వీడియోలో ఉంది తాను కాదని.. ఎవరో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రూపొందించారని.. తను అలాంటి మహిళను కాదని.. దేవుడి కోసం సర్వం త్యాగం చేశానని.. సాధ్వి గా మారిపోయానని.. భౌతిక పరమైన కోరికలను మొత్తం త్యజించానని” పేర్కొన్నారు. ఆమె వివరణ ఇచ్చే సమయం వరకే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో రాజస్థాన్ మీడియాలో రకరకాల వార్తలు ప్రసారం అవుతున్నాయి.
కింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి వీడియో చుడండి