గురువు చూపిన మార్గంలో నడవడం, సమాజానికి సేవే నిజమైన గురుదక్షిణ
గురు పౌర్ణమి సందర్భంగా షాద్‌నగర్ షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి
( పయనించే సూర్యుడు జూలై 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )వేదవ్యాస మహర్షి, గురుపరంపరను స్మరించుకుంటూ, ఆమె మాట్లాడుతూ, గురు పౌర్ణమి భారతీయ సంస్కృతిలో గురువుల పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసే అత్యంత పవిత్రమైన పర్వదినమని అన్నారు. జ్ఞానాన్ని అందించి సమాజ నిర్మాణానికి దోహదపడే గురువుల సేవలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ గురువులను గౌరవిస్తూ వారు చూపిన సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.సద్గురు సాయిబాబా బోధించిన ‘శ్రద్ధా – సబూరి’ సూత్రాలు ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకాలని పేర్కొంటూ, ప్రేమ, సేవ, త్యాగం, మానవత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.