PS Telugu News
Epaper

చితకొట్టిన మహిళ..! పాపకు సరైన శాస్తి జరిగింది.. ఇంకో సారి బుద్ధుంటే టైన్ లో రీల్స్ చేయదు.. (వీడియో చూడండి)

📅 21 Nov 2025 ⏱️ 7:26 AM 📝 వైరల్ న్యూస్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :- ప్రస్తుతం సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరు బిజీ అయిపోయారు. కొంత మంది రీల్స్‌ చేస్తూనో, మరికొంత మంది ఆ రీల్స్‌ చూస్తూనో తీరిక లేకుండా గడుపుతున్నారు. రీల్స్‌ పిచ్చిలో పడి కొంత మంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రకరకాల స్టంట్స్‌ వేస్తున్నారు. ఏదో విధంగా ఫేమస్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియలో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఒక అమ్మాయి కదులుతున్న రైలు బోగి డోర్‌ వద్ద నిలబడి రీల్ తయారు చేస్తున్నట్లు కనిపిస్తుంది. రాత్రి కావడంతో రైలు బయట అంతా చీకటిగా ఉంది. ఆ అమ్మాయి నల్లటి క్రాప్ టాప్, చిరుతపులి చారలతో ఉన్న టైట్ లెగ్గింగ్స్, గ్లాసెస్ ధరించి ఉంది. ఆమె జుట్టు విప్పుకుని ఉంది. ఆ అమ్మాయి సూపర్ స్టార్ సింగర్ డివైన్ పాటకు రీల్ చేస్తుండగా అకస్మాత్తుగా ఆమె తల్లి వెనుక నుండి కనిపిస్తుంది. ఆమె మొదట అమ్మాయిని పట్టుకుని రైలు గేటు గుండా లోపలికి తీసుకువస్తుంది. ఆ తర్వాత ఆమె అమ్మాయిని, బహుశా ఆమె కూతురు అయి ఉండవచ్చు, మూడు లేదా నాలుగు సార్లు చెంపదెబ్బ కొడుతుంది. ఈ సమయంలో ఆ మహిళ ముఖం కోపంతో ఎర్రగా కనిపిస్తుంది. “రాత్రిపూట నన్ను నిద్రపోనివ్వవా? అందరినీ లేపి రీల్ చేస్తావా?” అని ఆమె అంటున్నట్లు అనిపిస్తుంది. ఇంటర్నెట్ వినియోగదారులు ఈ వీడియో పై ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. ఆ అమ్మాయి తల్లి సరైన పనే చేసింది అంటూ పోస్టులు పెడుతున్నారు.

Scroll to Top