బోనాల పండుగ సాంగ్ షూటింగ్‌కు శ్రీకారంమున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభం.

July 31, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ జులై 30-07-2026 కేంద్రంలోని శ్రీ గంగమ్మ దేవాలయం మరియు శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయాల్లో “నేటి లీడర్ మ్యూజిక్ ఛానల్” ఆధ్వర్యంలో రూపొందిస్తున్న బోనాల పండుగ ప్రత్యేక సాంగ్ షూటింగ్‌ను మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందుతున్న ఈ బోనాల జాతర సాంగ్ పెబ్బేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు,hmtv జర్నలిస్ట్, జి. బాలవర్ధన్ సాహిత్యం అందించగా, కొరియోగ్రాఫర్ మాస్టర్ నవీన్ ఆధ్వర్యంలో చిత్రీకరణను వైభవంగా నిర్వహించారు.షూటింగ్ సందర్భంగా మహిళలు బోనం కుండలను తలపై మోసుకుంటూ, చిన్నారులు సంప్రదాయ వేషధారణలో పాల్గొని సందడి చేశారు. డప్పు, జమ్మడిక వాయిద్యాల నడుమ తెలంగాణ జానపద కళారూపాలను ఆవిష్కరిస్తూ చిత్రీకరణ అద్భుతంగా సాగింది.ఈ సందర్భంగా పలువురు స్థానిక ప్రజలు, భక్తులు చిత్రీకరణను ఆసక్తిగా వీక్షించారు. త్వరలో ఈ బోనాల జానపద గీతాన్ని నేటి లీడర్ మ్యూజిక్ ఛానల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్వాహకులు తెలిపారు

🌐 Select Language:
📰 ePaper