కష్టతరంగా మారిన రేషన్ కార్డు కేవైసీ విధానం.

August 1, 2026 | తెలంగాణ

గురుకుల, సంక్షేమ హాస్టల్ల దగ్గరనే విద్యార్థుల ఈ కేవైసీ ని పూర్తి చేయాలి.

జె.వెంకటపతి రాజు పుడమి ఫౌండేషన్ చైర్మన్

పయనించే సూర్యుడు ఆగస్టు1 మక్తల్ రేషన్ కార్డుల కేవైసీ సంబంధించిన వివరాలు ఈనెల చివరి వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ కేవైసీ పూర్తి చేయడం కోసం ఇతర ప్రాంతాలలో వివిధ గురుకుల పాఠశాలలో మరియు సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్న అనేక మంది విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.గురుకులాల నుండి ఒకేసారి పిల్లలను పంపించడం కుదరదని పాఠశాల ప్రిన్సిపల్ చెప్తున్నారు. కావున పిల్లల చదువులకు అంతరాయం కలగకుండా ఒకే దగ్గర ఉంటున్న వందలాది మంది పిల్లల దగ్గరికి అక్కడ అందుబాటులో ఉన్న రేషన్ డీలర్లను ఈ కేవైసీ పూర్తి చేయడం కోసం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.ప్రభుత్వం వీటిపై వెంటనే స్పందించి తగు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.ఇట్టి కార్యక్రమంలో పుడమి ఫౌండేషన్ ఉపాధ్యక్షులు రవికుమార్. శ్రీనివాస్. కోరిపవన్. దేవకినందన్. అరవింద్. సాయివిశాల్. నాని. తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper