వరద ప్రాంతాల్లో పారిశుధ్యం, వైద్య శిబిరం సందర్శించిన ఎంపీడీఓ బి రాజేశ్వరరావు

August 3, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు ఆగస్టు 3 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంవరదల తీవ్రత దృష్ట్యా ప్రభావితమైన పల్లంకుర్రు గ్రామ పంచాయతీని ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు, డిప్యూటీ ఎంపీడీఓ ఎన్ శంకర్ నారాయణ తో కలిసి సందర్శించారు. ఫ్లడ్స్ కారణంగా పాక్షికంగా నీరు చేరిన ఇంటి పరిసర ప్రాంతాల్లో ముమ్మర పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. పారిశుధ్యం నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని పంచాయతీ కార్యదర్శి రామారావును మరియు సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు. సందర్శనలో డిప్యూటీ ఎంపీడీఓ ఎన్ శంకర్ నారాయణ మరియు స్వర్ణ గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper