చింతగూడ లో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
పాల్గొన్న ఐసిడిఎస్ సూపర్వైజర్ విమల
( పయనించే సూర్యుడు ఆగస్టు 05షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఫరూక్నగర్ మండలం చింతగూడలోని అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి టీచర్లు సువర్ణ మరియు సుధా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ విమల పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. పసి పిల్లలకు తల్లిపాలు ఎంతో ముఖ్యమని అప్పుడే పుట్టిన పిల్లల నుండి ఆరు నెలల వరకు తల్లిపాలను మాత్రమే పట్టించాలని తద్వారా పిల్లలకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ విమల అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ విమల మరియు అంగన్వాడీ టీచర్లు సుధా మరియు సువర్ణ మరియు చిన్నపిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.