కాట్రేనికోనలో సామూహిక శ్రీమంతాలు, తల్లిపాల వారోత్సవాలు

August 5, 2026 | ఆంధ్రప్రదేశ్

తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన

పయనించే సూర్యుడు: ఆగస్టు 5 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ముమ్మిడివరం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలను నిర్వహించారు. కాట్రేనికోనలో ముమ్మిడివరం మహిళ శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ ముదునూరి నిహారిక అధ్యక్షతన జరిగిన తల్లిపాల వారోత్సవాలు, సామూహిక శ్రీమంతాలకు ఎంపీడిఓ రాజేశ్వరరావు ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి పాలు అవశ్యకతపై మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ప్రతి ఏటా తల్లిపాల వారోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. అంగన్ వాడీ కేంద్రాల పరిధిలో చిన్నారులకు, కౌమార బాలికలకు, గర్భవతులు, బాలింతలకు పోష్టికాహారంను అందజేస్తున్నారు. సీడిపిఓ నిహారిక మాట్లాడుతూ తల్లి ముర్రు పాలును బిడ్డకు పట్టించడం ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తుందన్నారు. కాట్రేనికోన పిహెచ్సీ వైద్యులు దేవీశ్రీ మాట్లాడుతూ బాలికలకు తెలిసీ తెలియని వయస్సులో బాల్యవివాహాలు చేయడంతో వస్తున్న టీనేజ్ ప్రెగ్నెన్సీతో తల్లి బిడ్డల ఆరోగ్యం ప్రమాదకరమన్నారు. ఈకార్యక్రమంలో కాట్రేనికోన ఎంఈఓ నామాల కృష్ణమోహన్ ,అంగన్ వాడీ సూపర్ వైజర్లు తులసి, ఎల్వి రమణి, అంగన్ వాడీ కార్యకర్తలు, ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

🌐 Select Language:
📰 ePaper