గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ విజయవంతం

August 5, 2026 | సినిమా వార్తలు

……..గ్రామ సభకు అధ్యక్షత వహించిన అశ్వాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్

పయనించే సూర్యుడు, ఆగస్ట్ 05, అశ్వాపురం: బుధవారం రోజు అశ్వాపురం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది.గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా తాగునీరు, పారిశుధ్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పర్యావరణ పరిరక్షణ, విద్య, ఆరోగ్యం, మహిళా మరియు బాలల సంక్షేమం తదితర అంశాలపై గ్రామ ప్రజల నుంచి సూచనలు, అభిప్రాయాలు స్వీకరించబడ్డాయి.ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మాట్లాడుతూ, గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా పారదర్శకంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికప్రణాళికను రూపొందించి, ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించి గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి గ్రామస్థుడు గ్రామసభల్లో చురుకుగా పాల్గొని గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాశరావు, వార్డు సభ్యులు నూకల లింగయ్య, చింతల అనుపమ,చెట్టుపల్లి రమాదేవి,కుర్సం అనసూర్య, జరుపుల కౌసల్య, ఎంపీడీఓ ముత్యాలరావు,గ్రామ పంచాయతీ కార్యదర్శి యాకూబ్, గ్రామస్థులు, మహిళా సంఘాల సభ్యులు, యువత మరియు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సభలో వచ్చిన ప్రతిపాదనలను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి GPDP ప్రణాళికలో చేర్చి అమలు చేయాలని నిర్ణయించారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యమే విజయానికి మూలమని సమావేశంలో పేర్కొన్నారు.

🌐 Select Language:
📰 ePaper