రాబోయే తరానికి విద్యార్థులే నాయకులు కావాలి
కాకతీయ పాఠశాల ప్రిన్సిపాల్ రఫత్ సుల్తానా
కాకతీయ స్కూల్లో ఘనంగా స్టూడెంట్ లీడర్ ఎలక్షన్స్
( పయనించే సూర్యుడు ఆగస్టు 08 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )షాద్నగర్ పట్టణం భాగ్యనగర్ కాలనీలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో శుక్రవారం పాఠశాల ఆవరణలో స్కూల్ లీడర్ ఎలక్షన్ నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా పాఠశాల పదవ తరగతి విద్యార్థులు హెడ్ గర్ల్ గా సి .దీక్షిత,వేద,హాసిని, పవిత్ర మరియు బాలుర నుండి హెడ్ బాయ్ గా రియాజ్, రెహాన్, సుప్రాంత్, యుగంధర్ శివప్రసాద్ పాల్గొన్నారు. ఇందులో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ప్రత్యక్ష ఓటింగ్ విధానంలో పాల్గొని విద్యార్థులను ఎన్నుకొన్నారు. బాలుర నుండి ఎం.డి రియాజ్ ని, బాలికల నుండి సి. దీక్షిత ను ఎన్నుకోవడం జరింగింది. గెలుపొందిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ రఫత్ సుల్తానా అభినందించారు. వీరు రాబోవు తరాలలో ఒక మంచి నాయకుడిగా ఎదగాలని రాబోవు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరచాలని తమకు జన్మనిచ్చిన తల్లితండ్రులను, విద్యనభ్యసించిన పాఠశాలకు మంచిపేరు తీసుక రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, రఫీ,ఇమ్రాన్, శ్రీనివాస్, విజయ, సునీత,మానస మరియు ఇతర ఉపాద్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.