లేమామిడి మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్‌ను పరామర్శించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

August 7, 2026 | తెలంగాణ

( పయనించే సూర్యుడు ఆగస్టు 08 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన కేశంపేట మండల లేమామిడి మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్‌ను ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పరామర్శించారు.ప్రమాదం అనంతరం ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో శ్రీశైలం గౌడ్ విశ్రాంతి తీసుకుంటున్నారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.శ్రీశైలం గౌడ్‌కు ధైర్యం చెబుతూ,ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ పరామర్శ సమయంలో సర్పంచులు నాగిళ్ళ వెంకట్, స్వప్న భూపాల్ రెడ్డి,లేమామిడి వెంకట్ నారాయణ్ రెడ్డి,మాజీ సర్పంచులు తాండ్ర విష్ణు వర్ధన్ రెడ్డి,బాల్ రాజ్ గౌడ్,యారం శేఖర్ రెడ్డి,నాయకులు సుదర్శన్ కేశంపేట మురళి,శశి,శేఖర్ లేమామిడి యువకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper