జైలు భరో కార్యక్రమంలో భాగంగా భీంగల్ లో ర్యాలీ రాస్తారోకో.

పయనించే సూర్యుడుD.10.8.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్..ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక కర్షక సంఘాల పిలుపులో భాగంగా భీంగల్ పట్టణంలో అంగన్వాడీ ఉద్యోగులు సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకోనో చేయటం జరిగింది ఈ సందర్భంగా అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కైరిదేవ గంగు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల గోవర్ధన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు మోహన్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోర్లను తీసుకురావడం సరైంది కాదని ,వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని కార్మికులకు కనీస వేతనాలు అమలు జరపాలని ,ఉద్యోగ భద్రత కల్పించాలని ,ఉపాధి హామీ చట్టాన్ని పాత విధానం కొనసాగించాలని, పెరుగుతున్న ధరలను అదుపు చేయాలని, విత్తన చట్టాన్ని సవరించాలని, పంటలకు మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు జ్యోతి, ప్రమీల, లక్ష్మి, యమునా, భాగ్య ఏర్గట్ల చంద్రకళ జయంతి తదితరులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.