కాట్రేనికోనలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
పయ నించే సూర్యుడు ఆగస్టు 10 కాట్రేనికోన ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో, ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాట్రేనికోన మండలం తిమ్మాపురం నుంచి ఎంఆర్వో కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, ముమ్మిడివరం నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీను, సిఇసి సభ్యులు పితాని బాలకృష్ణ, ఎస్ఇసి సభ్యురాలు కాశి బాలమునికుమారి, దొరబాబు, జడ్పీటీసీ నేల కిషోర్ కుమార్, నడింపల్లి సూరిబాబు, చిట్టి రాజు, డిల్లి నారాయణ, నడింపల్లి సందీప్, గంటి సుధాకర్, నల్లా నరసింహమూర్తి, మోకా చంద్ర నాగరత్నం, యేడిద సుబ్బారావు, జగడం బాలయోగి, ఎంపీపీ కోలాటి సత్యవతి సత్యం, చల్లగల అప్పారావు, కాశి హనుమంతరావు, అక్కల శ్రీధర్, గిడ్ల శ్రీనివాసు, గిడ్డి తిరుపతి వెంకటేశ్వరరావు, పండు సత్యనారాయణ, మల్లాడి వీరాబాబ్జి, వాసంశెట్టి శ్రీనివాసు, కోలా బాబ్జి, బొంతు సత్య శ్రీనివాస్, జగత బాబ్జి, కాశి రామకృష్ణ, కాశి వెంకటరమణ, కాశి కుమార్, రాయపు రెడ్డి జానకిరామయ్య, జంగారెడ్డి రమేష్, రెడ్డి శివన్నారాయణ, కోన శీను, పెయ్యల చిట్టిబాబు, వీరబాబు, జానిపల్లి శ్రీను, ఎలిపే భీమరాజ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, యువత, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన ర్యాలీని విజయవంతం చేశారు.