నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా….

August 15, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య , వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి , మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయం చైర్మన్ అర్జుమంద్ అలీ తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గౌరవాన్ని చాటారు.ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.గాంధీ పార్క్, ట్యాంక్ బండ్, బుధవార్పేట్ వార్డు నెం. 36లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబెర్లు, మున్సిపల్ కమీషనర్, డిఈ హరిభువన్,మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper