ఫరూక్ నగర్ ఎమ్మార్వో నాగయ్యకు ఘన సన్మానం

August 17, 2026 | తెలంగాణ

( పయనించే సూర్యుడు ఆగస్టు 18 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) సన్మానించిన లింగారెడ్డిగూడెం సర్పంచ్ ఎంసి ప్రవీణ్ కుమార్ ఉప సర్పంచ్ ఎర్రోళ్ల అశోక్ ఇటీవల ఉత్తమ సేవా ప్రశంసాపత్రం అందుకున్న ఫరూక్‌నగర్ మండల ఎమ్మార్వో నాగయ్యను లింగారెడ్డిగూడ గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ ఎంసీ ప్రవీణ్ కుమార్, ఉపసర్పంచ్ ఎర్రోళ్ల అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఎమ్మార్వో నాగయ్యను శాలువాతో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ, రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతూ, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న ఎమ్మార్వో నాగయ్యకు ఉత్తమ సేవా ప్రశంసా పత్రం లభించడం గర్వకారణమన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు చేస్తున్న కృషిని అభినందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఉత్తమ సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎమ్మార్వో నాగయ్యను సన్మానించడం సంతోషంగా ఉందని సర్పంచ్ ఎంసీ ప్రవీణ్ కుమార్, ఉపసర్పంచ్ ఎర్రోళ్ల అశోక్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ నరేందర్ రెడ్డి, వీరేష్ గౌడ్, ఖదీర్‌తో పాటు గ్రామ పెద్దలు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొని ఎమ్మార్వో నాగయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper