పాపన్న ఆశయాలు నెరవేర్చినప్పుడే అసలైన నివాళి *

August 18, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో : జెసి కిషోర్ కుమార్, మోకుదెబ్బ అధ్యక్షులు అమరవేణి* ఈరోజు నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జైంట్ కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్ జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్ జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి దండు శ్రీనివాస్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ నిర్మల్ జిల్లా సూపరింటెండెంట్ వేముల శ్రీనివాస్ డి వి సి డి ఓ సత్యనారాయణరెడ్డి ఎస్సీ కార్పొరేషన్ ఈ డి శంకర్ ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారులు రాజేశ్వర్గౌడ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.జాయింట్ కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్ మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్ మాట్లాడుతూ:- దాదాపు 400 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు మొగల్ పాలకుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిలబడిన యోధుడు పాపన్న అన్నారు.నిరుపేదంలో కుటుంబంలో జన్మించిన పాపన్న పేదల పక్షాన రాజ్యంహిసకు వ్యతిరేకంగా పన్నుల విధానానికి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాల ప్రజల్ని ఐక్యం చేసి ఉద్యమించి తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు సర్వాయి పాపన్న అన్నారు.సర్వాయి పాపన్న దాదాపుగా 20 కోటలను జయించి గోల్కొండ ఖిల్లా ను పరిపాలించిన మహారాజు అన్నారు.భారత దేశం లోనే మొట్ట మొదటి బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాడిన విప్లవ వీరుడు అన్నారు సర్వాయి పాపన్న ఆరోజు పోరాటం నిర్వహించడం వల్లనే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కే విధంగా సూచించినటువంటి మొట్టమొదటి వీరుడు పాపన్న అన్నారు.వారి ఆశయాలు నెరవేర్చడం అంటే వారు పోరాడి సూచించి రాజ్యాధికారం దక్కించుకున్నప్పుడే నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంగస్వామి, సబ్ ఇన్స్పెక్టర్ K, అభిషేఖర్ మోకుదెబ్బ రాష్ట్ర నాయకులు పడాల రాజేందర్ గౌడ్ , తీగల వెంకట్ గౌడ్, కొండ బాల గౌడ్ జిల్లా నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్,యాగండ్ల దశ గౌడ్, కొండ మురళి గౌడ్, తిరుపతి గౌడ్, కుమార్ గౌడ్ రాజేశ్వర్ గౌడ్, గంగాధర్ గౌడ్, దేవేందర్ గౌడ్, వేణు గౌడ్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన గౌడ కులస్తులు ఎస్సీ ఎస్టీ బీసీకులాల ప్రజలు పాల్గొని నివాళులు అర్పించారు.

🌐 Select Language:
📰 ePaper