PS Telugu News
Epaper

శ్రీ సత్యం జూనియర్ కళాశాల విద్యార్థుల రికార్డుల ప్రభంజనం

📅 15 Apr 2026 ⏱️ 5:21 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు)

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో శ్రీ సత్యం జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం
2026 మార్చి పరీక్షా ఫలితాలలో, నాడైనా, నేడైనా, రేపైనా, MPC, BIPC, MEC, CEC గ్రూపు ఏదైనా రిజల్ట్స్ లో, ఎగ్జామ్ సెంటర్ ఏదైనా రిజల్ట్ లో నెంబర్ 1 శ్రీ సత్యం నేడు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో జిల్లా స్థాయి, డివిజన్ రికార్డుల చరిత్ర సృష్టించిన ఏకైక విద్యాసంస్థ శ్రీ సత్యం జూనియర్ కాలేజ్.ప్రధమ సంవత్సర పరీక్ష పలితాలలో ఎంపీసీ గ్రూప్ నందు కె. మౌనిక 465/470 మిత్రా నర్సింహ రెడ్డి 465/470, డివిజన్ స్థాయిలో రికార్డు మార్కులు సాధించడం జరిగింది.BIPC గ్రూప్ నందు CH. షాలిని, A. ఆషిక 440/455 టౌన్ ఫస్ట్ ,
ఎంఇసి గ్రూప్ నందు SD. నర్మిన్ 482/500 టౌన్ ఫస్ట్ మార్కులు సాధించి రికార్డ్ సృష్టించడం జరిగింది.
ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలలో ఎంపీసీ గ్రూప్ నందు P. భాగ్యలక్ష్మి990/1000, M. హేమశ్రీ 990/1000 డివిజన్ స్థాయిలో రికార్డు మార్కులు సాధించడం జరిగింది. BIPC గ్రూప్ నందు K. కావ్య 982/1000టౌన్ ఫస్ట్, N. ఇందిరా ప్రియదర్శిని 979/1000 టౌన్ సెకండ్, ఎంఇసి గ్రూప్ నందు K. అహల్య 907/1000 టౌన్ ఫస్ట్ సిఈసి గ్రూప్ నందు రేణుక 949/1000 డివిజన్ టాప్ మార్కులు సాధించి రికార్డ్ సృష్టించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ పెమ్మారెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ సత్యం సృష్టించిన ప్రతిష్టమైన ప్రోగ్రామ్ లు, సరైన ప్రణాళిక,అగ్రశ్రేణి అధ్యాపకులతో శిక్షణ* వంటి ప్రత్యేకత వల్లే ఇంటర్మీడియట్ సబ్జెక్టు పై మా విద్యార్థులు కాన్సెప్ట్ వారీగా పట్టు సాధించడంతో పాటు స్ట్రాంగ్ ఫౌండేషన్ వల్ల ఇంటర్ లో టాప్ మార్కులు సాధ్యమైనాయని అన్నారు. అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులను, శ్రీ సత్యం విద్యాసంస్థలపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులను, ఇంతటి ఫలితాలు దోహదపడిన అధ్యాపక అధ్యాపకేతర బృందాన్ని కళాశాల ప్రిన్సిపాల్ అభినందించారు.

Scroll to Top