విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ రామకోటి
పయనించే సూర్యుడు ఏప్రిల్ 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
సూర్య తండ గ్రామపంచాయతీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం లో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించరు ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ధరావత్ రామకోటి నాయక్ ఎం ఈ ఓ నాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయులు ధరావత్ బాలాజీ ఉపాధ్యాయులు రమేష్ కార్యక్రమాన్ని సమన్వయం చేసి సర్పంచ్ రామకోటి ని ఆహ్వానించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఎండాకాలంలో తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులు మంచి అలవాట్లు అలవర్చుకుని, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు. ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య ఉన్న స్నేహపూర్వక బంధం
ఈ కార్యక్రమంలో స్పష్టంగా కనిపించింది. విద్యార్థులు తమ గురువుల పట్ల గౌరవంతో, ప్రేమతో మాట్లాడగా, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులపై చూపిన మమకారం అందరినీ కదిలించింది. వీడ్కోలు సమయంలో కొంతమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది.
ఇది వారి మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధానికి నిదర్శనం. ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య సంబంధం గురించి: ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పేవారు మాత్రమే కాదు, వారు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మార్గదర్శకులు. విద్యార్థులు కూడా గురువులను తల్లిదండ్రుల్లా భావించి గౌరవించాలి.
ఈ బంధం స్నేహం, ప్రేమ, నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.సర్పంచ్ వీడ్కోలు కార్యక్రమంలో ప్రియమైన విద్యార్థులారా, ఈ రోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. మీరు ఈ పాఠశాల నుంచి బయటకు వెళ్లినా, ఇక్కడ నేర్చుకున్న విలువలు ఎప్పటికీ మీతో ఉండాలి. గురువుల పట్ల గౌరవం, పెద్దల పట్ల మర్యాద, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్లినా మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి. మీ భవిష్యత్తు లో చాలా ఎత్తుకి ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.సర్పంచ్ చేతుల మీదగా విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడం జరిగింది
