సూళ్లూరుపేట మున్సిపల్ కార్మికులకు అదనపు పని భారం
పయనించే సూర్యుడు ఏప్రిల్ 25 ( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు)
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణం లోని రోడ్డు శుభ్రం చేస్తున్న మున్సిపల్ కార్మికులు గత పది రోజులుగా అయ్యప్ప స్వామి దేవస్థానం ఎదురుగా ప్రైవేటు కాంట్రాక్టర్ ఆర్ అండ్ బి రోడ్ లో ఇసుక సిమెంటు కాంక్రీట్ నిలువ చేసి అక్కడే జెసిబి లతో మిల్లర్లు తో రోడ్డు డ్యామేజ్ చేశాన పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు? ఎవరో కాంట్రాక్టర్ అక్కడ పని ముగించుకొని మిగిలిన, ఇసుక, కంకర, సిమెంట్ పొడి, రోడ్డు మీదనే వదిలేసి వెళ్లిపోయాడు రోడ్డుని మున్సిపల్ కార్మికులు అదనపు పని భారంతో శుభ్రం చేస్తున్నారు ఇది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ తెలిపారు . ఆయన మాట్లాడుతూ ఎవరో ప్రైవేట్ కాంట్రాక్టర్ రోడ్డుమీద ఇసుక కంకర సిమెంటు డంపు చేయడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు రోడ్డుమీద డంపు చేస్తే అధికారులు ఎందుకు స్పందించలేదు, ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోలేదు? కూటమి ప్రభుత్వంలో అధికారులు చేస్తున్న పనితీరు, ప్రజాధనం వృధాగా నష్టం చేస్తున్నారు ఇకనైనా అధికారులు పనితీరు మారాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ పత్రిక ముఖంగా డిమాండ్ చేశారు
