PS Telugu News
Epaper

కాకినాడలో కేంద్ర సహాయమంత్రి పర్యటన.

📅 30 Apr 2026 ⏱️ 2:26 PM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ; కాకినాడ : కేంద్ర సమాచార, ప్రసార మరియు పార్లమెంట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రివర్యులు డా. ఎల్. మురుగన్ బుధవారం వ్యక్తిగత పర్యటనలో భాగంగా కాకినాడ చేరుకున్నారు.స్థానిక హోటల్లో బసచేసిన మంత్రికి జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. అనంతరం బాలాత్రిపురసుందరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ గ్రంథి నారాయణ రావు, ఈవో వీర్రాజు చౌదరి, కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా ఈవో, చైర్మన్ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో తెదేపా యువనేత మోహన్ వర్మ, నగర టిడిపి అధ్యక్షుడు మల్లిపూడి వీరు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, యెనిమిరెడ్డి మాలకొండయ్య, బీజేపీ నేతలు దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top