PS Telugu News
Epaper

సూళ్లూరుపేట లో టెన్త్ ఫలితాలలో సత్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభంజనం

📅 30 Apr 2026 ⏱️ 2:27 PM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 30 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట
పట్టణంలో ని సత్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈరోజు విడుదలైన పదో తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి టౌన్ సెకండ్‌గా నిలిచింది. ఈ ఫలితాలతో స్కూల్ మరోసారి తన విద్యా ప్రమాణాలను నిరూపించు కుంది ఈ స్కూల్‌కు చెందిన విద్యార్థిని కోటా కృష్ణశ్రీ 600లో 593 మార్కులు సాధించి అద్భుత ప్రతిభను కనబరిచింది ఆమె కృషి, పట్టుదలతో ఈ స్థాయి ఫలితాన్ని సాధించడం విశేషంగా నిలిచింది.కృష్ణశ్రీ సాధించిన ఫలితంతో స్కూల్‌కు మంచి పేరు ప్రతిష్టలు దక్కాయి. పాఠశాల ఉపాధ్యాయులు ఆమె విజయానికి కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు ఈ విజయంపై స్కూల్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థిని అభినందించింది ఇలాంటి ఫలితాలు మరింత మంది విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు విద్యార్థిని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు. తమ కుమార్తె మరింత ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు సత్యం స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని విద్యార్థుల పట్ల మా సొంత త పిల్లలు లాగా దగ్గరుండి చూసుకుంటూ ప్రతి చిన్న డౌట్ ని వాళ్లకి అర్థమయ్యే రీతిలో బోధిస్తూ ఉన్నత శిఖరాలను ఎలా అధిరోహించాలో వివరిస్తూ పిల్లల మనసులో మనో ధైర్యాన్ని నింపుతున్నామని సత్యం స్కూల్ ప్రిన్సిపాల్ డి. సత్యనారాయణ వివరిస్తూ స్కూలు విద్యార్థిని విద్యార్థులని అభినందించారు

Scroll to Top