వివాహ వేడుకల్లో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు

August 26, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కొంపల్లిలోని ఎ.ఎమ్.ఆర్ గార్డెన్స్ & హైందవ నిమంత్రాన్, కూకట్‌పల్లిలోని ఎన్.కె.ఎన్.ఆర్ గార్డెన్స్ మరియు ఎల్లమ్మబండలో బంధుమిత్రులు, కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన వివాహ వేడుకలకు వారి ఆహ్వానం మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను కలిసి అభినందించి, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ఆనందంగా దాంపత్య జీవితాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.వివాహ వేడుకలకు విచ్చేసిన బంధుమిత్రులు, కార్యకర్తలు, అభిమానులతో రాజేశ్వరరావు ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేసి, ఆత్మీయతను పంచుకున్నారు.ఈ సందర్భంగా ఆయా కుటుంబ సభ్యులు రాజేశ్వరరావు తమ ఆహ్వానాన్ని మన్నించి వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper