ఉత్కంఠకు తెర.. 7గురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నారన్న సమాచారం ఆనందం కలిగించింది_ దాట్ల బుచ్చిబాబు
పయనించే సూర్యుడు ఆగస్టు 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి వేటకు వెళ్లి గత 23 రోజులుగా ఆచూకీ లేకుండా ఉన్న 7గురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నారన్న సమాచారం అందడం పట్ల ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్షేమంగా పశ్చిమ బెంగాల్ తీరంలో ఉన్న బాధితులతో దాట్ల సుబ్బరాజు టెలిఫోన్ లో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చి త్వరలోనే సొంత ఇళ్లకు చేరే ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మత్స్యకారుల కోసం గత 23 రోజులుగా నిరంతరం గాలింపు చర్యలు చేపట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలకు, సహకరించిన అధికారులకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడం అభినందనీయమన్నారు. 7గురు మత్స్యకారులు త్వరితగతిన సురక్షితంగా తమ స్వగ్రామాలకు చేరుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు. గత 23 రోజులుగా ఆందోళనలో ఉన్న వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం నింపిన ఈ శుభవార్త ఎంతో సంతోషాన్ని కలిగించిందని దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు.