సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
పాల్గొన్న సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు
( పయనించే సూర్యుడు ఆగస్టు 31 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)షాద్ నగర్ ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు షాద్నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.బూర్గుల గ్రామానికి చెందిన చాకలి శ్రీను 60000, కావలి మహేందర్ కు 48000 కుమ్మరి నర్సింహులు 16,000 రూపాయలకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే క్యాం కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రిలీఫ్ ఫండ్ నిరంతరం జరిగే ప్రక్రియ అని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వరం లాంటిదని అన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డికి మరియు షాద్నగర్ శాసనసభ్యులు విల్లపల్లి శంకర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుమ్మరి శ్రీనివాస్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్ బూర్గుల సర్పంచ్ చిల్కమర్రి రాజగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు ఇబ్రహీం ఆశన్న గౌడ్ గోపి నాయక్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.