వినాయక నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన చైర్‌పర్సన్, మున్సిపల్ కమిషనర్..

September 3, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.3.9.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్..భీంగల్ మండలంభీంగల్: రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని భీంగల్ పట్టణంలో వినాయక నిమజ్జనం జరిగే రాగన్నగట్ట ప్రాంతాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా ప్రాంతంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, రహదారి సౌకర్యాలు, భద్రత తదితర ఏర్పాట్లు ముందస్తుగా చేపట్టాలని సూచించారు.వినాయక చవితి సందర్భంగా భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిమజ్జన ప్రాంతంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చైర్‌పర్సన్ నాగమణి స్వామి, కమిషనర్ డి. గజానంద్ తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రజలు, నిర్వాహకులు మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు.కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు తోట సతీష్. అంజుమాలీ. సందీప్. సంగ్య నాయక్. ప్రజాప్రతినిధులు జై జై నరసయ్య. బోదిరే నర్సయ్య.గున్నాల భగత్. తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper