కోనసీమ జిల్లా పరిషత్ చైర్మన్ రేసు రసవత్తరం… పలువురు ఆశావాహులు రంగంలోకి

September 3, 2026 | ఆంధ్రప్రదేశ్

సూర్యుడు సెప్టెంబర్ మూడు అమలాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఅమలాపురం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిషత్ వేరు కానున్న నేపథ్యంలో చైర్మన్ పదవి రేసు జోరుగా సాగుతోంది. గతంలో ఉమ్మడి జిల్లా పరిషత్ బీసీ, ఎస్సీ రిజర్వుడు కావడం, మూడు రిజర్వుడు నియోజకవర్గాలు, ఎంపీ కూడా ఎస్సీ కావడంతో ఈసారి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి తప్పనిసరిగా జనరల్ కేటగిరీలోకి వస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో స్థానిక ఆశావాహులు ఇప్పటినుంచే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. బిజెపి నుంచి: గుంటూరు జిల్లా బిజెపి ఇంచార్జ్ యాళ్ల దొరబాబు బిజెపి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. టిడిపి నుంచి: జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు దూకుడుగా ఉన్నారు. పట్టణంలో ఉండే ఆయన తన ఓటు హక్కును గుడాల గ్రామానికి మార్చుకున్నారు. టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెరుకూరి సాయిరాం కూడా తన ఓటును చిందాడగరువు గ్రామానికి మార్చుకున్నారు. టిడిపి సీనియర్ నాయకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ తాను బలమైన అభ్యర్థినని చెబుతున్నారు. మాజీ ఎంపిపి బొర్రా ఈశ్వరావు అవకాశం వస్తే పోటీలో ఉంటానని ఒకేసారి స్పష్టం చేశారు. జనసేన నుంచి: కొత్తపేట ఇంచార్జ్ బండారు శ్రీను జనసేన నుంచి రంగంలో ఉండే అవకాశం ఉంది. అమలాపురం నుంచి లింగోలు పండు తాను ఉన్నానని చెబుతున్నారు. గమనిక: జిల్లా పరిషత్ కు ఓటు గ్రామాల్లో ఉండాలి. గతంలో ఉమ్మడి జిల్లా పరిషత్ విషయంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప గ్రామంలో ఓటు లేకపోవడం వల్ల అవకాశం దూరమైన నేపథ్యంలో నేతలు ముందుగానే మేల్కొని ఓట్లు మార్చుకుంటున్నారు. జిల్లా పరిషత్ జనరల్ కు వస్తుందనే ప్రచారంతో అన్ని పార్టీల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. రాబోయే రోజుల్లో అభ్యర్థుల జాబితా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

🌐 Select Language:
📰 ePaper