ఆక్వా రైతుల సమస్యలపై కలెక్టర్ కు వినతి… ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని ఆశ
పయా నించే సూర్యుడు 03/09/2026 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆక్వా ఫీడ్ రేట్లు పెరగడం, కరెంట్ సబ్సిడీ ఆలస్యంపై కోనసీమ జిల్లా ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లకు వినతిపత్రం సమర్పించారు. ఫీడ్ ధరలు తగ్గించాలని, కరెంట్ సబ్సిడీని వెంటనే అమలు చేయాలని వినతిలో కోరారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహకారంతో ఆక్వా రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాబావం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆక్వా కార్యదర్శి త్సవటపల్లి నాగభూషణం, యేళ్ళ వేంకటనందం, త్సవటపల్లి మణికుమార్, సత్తి శ్రీను, కాశిరాజు త్సవటపల్లి శ్రీను, ఆనంద్, మోటూరి నాని, చవతపల్లి రఘు, సలాది తాతాజీ, సుధ రాఘవేంద్ర, కనకాల సతీష్, త్సవటపల్లి హేమంత్, మానే శ్రీను, కుతుకులపూడి శివ, శ్రీను రాజు తదితరులు పాల్గొని రైతుల తరపున వినతి అందజేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందనే నమ్మకంతో అందరూ ఐక్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.