ఫరూక్ నగర్ మండల ఏఐఎస్ఎఫ్ 8వ నూతన నిర్మాణ మహాసభ

September 3, 2026 | సినిమా వార్తలు

విద్యా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు విద్యార్థులు సిద్ధం కావాలి

ఎం శ్రీను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మాజీ విద్యార్థి సంఘం నాయకుడు

దేశ స్వతంత్ర ఉద్యమం లో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్

బుద్ధుల జంగయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ జీవో నెంబర్ 97 రద్దుకై విద్యార్థులు ఉద్యమానికి సిద్ధం కావాలి

నూతనంగా ఎన్నికైన కమిటీ విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయాలి

ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పవన్ చౌహన్ వంశీ వర్ధన్ రెడ్డి

( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 4 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఏఐఎస్ఎఫ్ ఫరూక్నగర్ మండల 8వ మహాసభను ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ఆధ్వర్యంలో షాద్నగర్ పెన్షనర్స్ హాల్లో 200 మంది విద్యార్థులతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు ముద్దుల జంగయ్య జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం శ్రీను ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ సోహన్ కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా ఏఐఎస్ఎఫ్ జెండాను జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహన్ ఆవిష్కరించి మహాసభను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు బుద్ధుల జంగయ్య ఎం శ్రీను మాట్లాడుతూ… విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ఏఐఎస్ఎఫ్‌కు దేశవ్యాప్తంగా గొప్ప పోరాట చరిత్ర ఉందని అన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, విద్యా రంగ పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు నిర్వహించిన ఘనత ఏఐఎస్ఎఫ్‌కు ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాల వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన ప్రభుత్వాలు విద్యా రంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు. విద్యార్థులపై పెరుగుతున్న ఫీజుల భారం, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు, నాణ్యమైన విద్యను ప్రతి విద్యార్థికి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలను ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకోకుండా, విద్యార్థి సంఘాలతో చర్చించి విధానాలను రూపొందించాలని అన్నారు. విద్యా రంగాన్ని కాపాడుకోవడానికి విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరింత విస్తృతమైన ఉద్యమాలు చేపడతామని, విద్యా వ్యతిరేక విధానాలను ఎక్కడికక్కడ ప్రతిఘటిస్తామని వారు స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ఉచిత నాణ్యమైన విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ల విడుదల, ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం కోసం పోరాటాలను ఉధృతం చేస్తామని తెలిపారు.మహాసభలో ఫరూక్నగర్ మండల పరిధిలోని విద్యార్థుల సమస్యలు, ఏఐఎస్ఎఫ్ భవిష్యత్ కార్యాచరణ, విద్యార్థులను ఉద్యమాల్లో మరింత భాగస్వామ్యం చేయడం తదితర అంశాలపై చర్చించారు. అనంతరంఏఐఎస్ఎఫ్ ఫరూక్నగర్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. మండల కార్యదర్శిగా అనిల్, అధ్యక్షుడిగా గణేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం సాయి ఉపాధ్యక్షులుగా” రాఘవేందర్ హర్ష నరేష్ వినోద్ సహాయ కార్యదర్శులుగా రాజేష్ ముజీత్ యశ్వంత్ కుమార్ గర్ల్స్ కన్వినింగ్ కమిటీ కన్వీనర్ గా అంకిత కో కన్వీనర్లు చంద్రకళ శిరీష దీక్షిత కావ్య పల్లవి అఖిల చందన తో పాటు 25 మందిని నూతన మండల కౌన్సిల్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, రాజేంద్రనగర్ మండలంలో ఏఐఎస్ఎఫ్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని మహాసభ గా పిలుపునిచ్చారు. ఈ మహాసభలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కే శివకుమార్ ఆకాష్ ఏఐఎస్ఎఫ్ నాయకులు సాయి శ్రీను వైష్ణవి శ్రీజ అఖిల తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper