భీంగల్ మండలం జాగిర్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకు ను ప్రారంభించిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్.

September 15, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.15.9.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. ఈరోజు మంగళవారం రోజున జాగిర్యాల గ్రామంలో ప్లాస్టిక్ నివారణలో భాగంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది .ఇట్టి స్టీల్ బ్యాంకులో 300స్టీల్ ప్లేట్లు 200 స్టీల్ గ్లాసులు మొదటి విడతగా అందుబాటులో ఉంచారు గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్ ప్లేట్లు ప్లాస్టిక్ గ్లాసులు వాడకుండా విధిగా ఇట్టి స్టీల్ ప్లేట్లను స్పీడ్ గ్లాసులను ఉపయోగించుకునే విధంగా గ్రామపంచాయతీ పాలవర్గం చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో సంతోష్ కుమార్ అన్నారు
జీపీ ఆవరణలో నిర్మిస్తున్న కమ్యూనిటీ సోక్ పిట్ ని పరిశీలించారు స్టీల్ బ్యాంకు ఏర్పాటుకు చొరవ తీసుకున్న గ్రామ సర్పంచ్ ప్రసాద్ ని ఉప సర్పంచ్ ని పాలకవర్గాన్ని ఎంపీడీవో అభినందించారు కార్యక్రమంలో జాగిర్యాల సర్పంచ్ ప్రసాద్ ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులు వీడీసీ సభ్యులు పంచాయతీ కార్యదర్శి భూమేశ్వర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper