అన్న సమారాధనలో పాల్గొన్న బీసీ నాయకులు తెల్ల హరికృష్ణ
పయనించే సూర్యుడు న్యూస్: సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి: జయనగర్ కాలనీ రోడ్ నంబర్ 3లోని టీ జంక్షన్ వద్ద కిట్టీ పార్టీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గురువారం మధ్యాహ్నం ఘనంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యుత్ ఉద్యోగుల సంస్థ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు జి. బ్రహ్మేంద్ర ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు, జర్నలిస్టు తెల్ల హరికృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించి, భక్తులకు నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెల్ల హరికృష్ణ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు భక్తిభావంతో పాటు ప్రజల్లో ఐక్యత, సోదరభావం పెంపొందించేలా నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్నదానం వంటి కార్యక్రమాలు సమాజంలో సేవా స్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో కిట్టీ పార్టీ సభ్యులు, నిర్వాహకులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.