పాపిరెడ్డి నగర్‌లో ఘనంగా వినాయక పూజలు.

September 17, 2026 | తెలంగాణ

వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్న శ్రీధర్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్: సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి: పాపిరెడ్డి నగర్‌లోని రోడ్డు నంబర్ 19 సి బ్లాక్‌లో స్థానికులు ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వెంకటేశ్వర నగర్, కూకట్‌పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పాపిరెడ్డి నగర్ పోటీ అధ్యక్షుడు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి శ్రీధర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. అనంతరం మండపం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మహాగణపతి స్వామివారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. వినాయక ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యతను పెంపొందించేలా కొనసాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చర్ల రామకృష్ణారెడ్డి, గడ్డం రాజేశ్వరరెడ్డి, మాయ రాజయ్య, ఈరెడ్డి దేవేందర్‌రెడ్డి, నరేందర్ గుప్తా, డాకురి అక్కిరెడ్డి, స్వామి, నాగరాజు, పవన్ కుమార్, సంతోష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మహేష్, రాజుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, వినాయక మండపం నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper