ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వరస్వామికి అభిషేకాలు, కుంకుమ పూజలు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలంలో ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్రి చిట్టిబాబు ఆధ్వర్యంలో, ఎస్ఐఆర్ రామచంద్రపురం నియోజకవర్గ కన్వీనర్ సాలాది శేఖర్ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ.వి రామమూర్తి సహాయ సహకారాలతో రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వరస్వామి వారికి అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొప్పిశెట్టి సూర్యచంద్రరావు, మండల ప్రధాన కార్యదర్శి ఎ.నారాయణమూర్తి, ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు కవులూరి వెంకటకృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు గుర్రాల సత్యనారాయణ, పట్నాల శ్రీనివాస్, దాసరి ముత్యాలు, దంగేటి మాచర్రావు, సాలాది రామకృష్ణ, తాళ్ల ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.