ప్రధాని మోడీపై అభిమానం చాటుకున్న సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్

September 17, 2026 | తెలంగాణ

నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్

( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 18 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) రూక్నగర్ మండలం కడియాల కుంట తండా సర్పంచ్ రాజు నాయక్ చౌహన్ ప్రధాని నరేంద్ర మోడీ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. గురువారం నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా షాద్నగర్ లోని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆఫీసులో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని తన రక్తాన్ని ఇవ్వడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ.. ప్రధాని మోడీ మరింతకాలం దేశ ప్రజలకు సేవ చేయాలని ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు

🌐 Select Language:
📰 ePaper