మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్ మండల్ పాలజ్ గ్రామంలో కర్ర గణపతి ఆలయంలో దర్శనం చేసుకున్న నిర్మల్ మున్సిపల్ చైర్మన్
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో శుక్రవారం నిర్మల్ జిల్లా సరిహద్దులోని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా భోకర్ మండలం పాలజ్ గ్రామంలోని ప్రసిద్ధ కర్ర గణపతి ఆలయం వద్ద నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కర్ర గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అన్నదాన కార్యక్రమానికి ముందు సార్వజనిక్ పాలజ్ కర్ర గణేష్ మండలి సభ్యులు సంప్రదాయ పద్ధతిలో ఊరేగింపు నిర్వహించి, గణనాథుడికి నైవేద్యం సమర్పించారు.పూజా కార్యక్రమాలు అనంతరం భక్తులకు అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి అన్నప్రసాదం పంపిణీ చేశారు.