ఊరంతా ఊట కుంటల నిర్మాణా పనులకే

పయనించే సూర్యుడుD.20.9.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. భీమ్గల్ మండలంలో పెద్దమ్మ కాడి తండా ఒక చిన్న మారుమూల గ్రామం సికింద్రాపూర్ గ్రామపంచాయతీ నుండి కొత్తగా ఏర్పడిన తాండVBGRAMG పథకంలో నీటి నిల్వ పనులు చేపట్టే కార్యక్రమంలో మేము ముందుంటాం అని కలిసికట్టుగా ముందుకు వచ్చి ఇప్పటికే 3 వ్యవసాయ నీటి కుంటలను పూర్తి చేసి జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్నారుగ్రామంలో నీటికుంటల ప్రాధాన్యత అవగాహన కార్యక్రమాల ద్వారా సర్పంచ్ రమేష్ యొక్క ప్రత్యేక చొరవ తో ఈ గ్రామం ఆదర్శ గ్రామం వైపు అడుగులు వేస్తుందిప్రతి ఇంటికి ఇంకుడు గుంత, మురుగు నీటి కాలువలు లేని గ్రామంగా ప్రయత్నంలో VBGRAMG సిబ్బంది ప్రణాళికలు తయారుచేసి ఒక క్రమ పద్ధతిలో ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామం వైపు పరుగులు తీయి స్తున్నారుఇప్పటికే గ్రామంలో 20 ఇంకుడు గుంతలు 3 కమ్యూనిటీ ఇంకుడు గుంతలు 1 rup top హార్వెస్టింగ్ స్ట్రక్చర్ పూర్తి చేసినారు మరియు జీవనోపాధి మెరుగుదల లో భాగంగా 6 గేదెల షెడ్డు పూర్తి చేయడం జరిగిందివర్షపు నీరును మరియు వాడిన నీరును మన భూమిలోని ఇనికించాలి అనే నినాదంతో గ్రామస్తులు ముందుకు రావడం అభినందనీయంజోరుగా వ్యవసాయ పనులు ఉన్నా కూడా ఆ పనులను సాయంత్రం వేళల్లో చేస్తూ ఉదయం పూట ఊరంతా ఊట కుంటల నిర్మాణం వైపే అడుగులు వేయడం ఒక గొప్ప విషయంగంగాదేవి పల్లె ఇబ్రహీంపూర్ గ్రామాల స్పూర్తి తో గ్రామస్తుల చైతన్యంగా ముందుకు రావడం గర్హనీయంఇటీవలే జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జి .సాయన్న ఈ గ్రామాన్ని సందర్శించి గ్రామస్తుల చైతన్య స్ఫూర్తిని అభినందించారుగ్రామపంచాయతీ భవనము, స్కూల్ కాంపౌండ్ వాల్ ,స్కూల్ మరుగుదొడ్లు, గ్రామ సంఘ భవన నిర్మాణము, పశువుల తొట్టి నిర్మాణము, నర్సరీ ,స్మశాన వాటిక, ప్లాంటేషన్ పల్లె ప్రకృతి వనం, సిసి రోడ్ల నిర్మాణంఇలా ఒకటి కాదు ప్రతి ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ఈ గ్రామం ఆదర్శంకొత్తగా ఎన్నికైన సర్పంచ్ రమేష్ మరియు పాలక మండలి, సీనియర్ మేట్ వకీలు, పంచాయతీ కార్యదర్శి మమత ప్రత్యేక చొరవ అభినందనీయంమండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ మండలంలో ఒకటైన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అనే దృఢ సంకల్పంతో ఈ గ్రామాన్ని మోడల్ విలేజ్ గా ఎంపిక చేసినారుఈ గ్రామస్ఫూర్తితో మండలంలోని అన్ని గ్రామాలు కూడా తయారు కావాలని వారి ఆలోచన.VBGRAMG పథకాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని గ్రామాలు కూడా ఆదర్శ గ్రామాలుగా ముందడుగు వేయాలని మండల ప్రజలను కోరుకున్నారు.VBGRAM G అదనపు కార్యక్రమా అధికారి జి నరసయ్య గ్రామాన్ని దత్తత తీసుకొని ఆదర్శ గ్రామం వైపు అడుగులు వేయిస్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్ రమేష్ మరియు ఇంజనీరింగ్ కన్సల్టెంట్ పూర్ణచంద్ సాంకేతిక సలహాలు ఇస్తూ పనుల నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు..ప్రజా ప్రతినిధుల చొరవ ప్రజల యొక్క చైతన్యం అధికారుల ముందు చూపు ఉంటే ప్రతి గ్రామం ఆదర్శ గ్రామం వైపు అడుగులు వేయవచ్చు..ఈ గ్రామమే నిదర్శనం..