గణేష్ సెంటర్ గణనాథునికి ఘనంగా పూజలు

September 20, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 ముమ్మిడివరం ప్రతినిధి గణపతి నవరాత్రులను పురస్కరించుకుని కాట్రేనికోన (మండలం) మెయిన్ రోడ్డు గణేష్ సెంటర్లో వేంచేసి ఉన్న వరసిద్ధి వినాయకునికి ప్రతిరోజు ఘనంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది . మండప బ్రహ్మ పెద్దింటి వ్యాసమూర్తి శర్మ (తంబి ) ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారస్తులు గ్రంధి వారి కుటుంబ సభ్యులచే స్వామివారికి విశేషంగా అభిషేకాలు, సహస్ర మోదక ( ఉండ్రాళ్ళ ) పూజ,వివిధ రకాల పుష్పాలు, పత్రులు, ప్రసాదాలతో పూజలు జరిపారు ప్రతిరోజూ ఉదయం సాయంత్రం అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని స్వామి వారికి వివిధ రకాల హారతులు,ఉయ్యాల సేవ, గరిక పూజలు జరుపుచున్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అఖండ దీపారాధన, లక్ష్మీ గణపతి హోమం,అన్న సమారాధన, పండిత సత్కారం,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొన్న దంపతులు భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ, గ్రంధి సురేష్, గ్రంధి బదరీ, మరియు చారుమతి దేవి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మరియు గణేష్ సెంటర్ కమిటీ సభ్యులు ఆశపు సూర్యారావు , శ్రీనివాస్, లక్ష్మణరావు, శంకరo, అంకం వెంకటేశ్వరరావు,రాజు, త్రిపుర గోపాలకృష్ణ,ఆకేటి శ్రీను, నరేష్, సుతాపల్లి నాగభూషణం,చిన్నా,చెరుకు బుజ్జి,శివయ్య,కోన సతీష్, నాగబాబు,బాబులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper