స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త పోటీకి సిద్ధం కావాలి – దాట్ల వెంకట సుబ్బరాజు పిలుపు

September 20, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 (ముమ్మిడివరం గ్రంధి నానాజీ) రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి క్రియాశీల కార్యకర్త స్వయంగా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధపడాలి.తనకు స్వయంగా జెడ్పీ చైర్మన్ గా, మున్సిపల్ చైర్మన్ గా, మండల అధ్యక్షునిగా, పంచాయతీ ప్రెసిడెంట్ గా పోటీ చేసే స్తోమత లేకుంటే, మన పార్టీ తరపున మున్సిపల్ వార్డుకు కానీ, జెడ్పీటీసీకి కానీ, ఎంపీటీసీకి కానీ, కనీసం పంచాయతీ వార్డు సభ్యునిగానైనా పోటీకి సిద్ధపడాలి.ఒకవేళ దానికి కూడా స్తోమత లేకుంటే, కార్యకర్తగా మన పార్టీ, మన కూటమి అభ్యర్థుల గెలుపు కోసం శక్తికి మించి ఈ రెండు నెలలు అవిశ్రాంతంగా కృషి చేయాలని చేతులు జోడించి, శిరస్సు వంచి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను.ఇట్లు మీ సహ కార్యకర్త, దాట్ల వెంకట సుబ్బరాజు, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ కార్యాలయ ఇన్-చార్జ్.

🌐 Select Language:
📰 ePaper