తెలంగాణ

అన్నారంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభం

అన్నారంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభం

ప్రారంభించిన సర్పంచ్ లావణ్య రామకృష్ణ

( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఫరూక్నగర్ మండలం అన్నారం గ్రామం ఫస్ట్ వార్డులో గ్రామపంచాయతీ నిధులతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను సర్పంచ్ లావణ్య రామకృష్ణ ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ బొగ్గుల శివశంకర్ యాదవ్, మార్కెట్ కమిటీ పీఏసీ డైరెక్టర్ లంకల రఘుగౌడ్, వార్డు సభ్యులు ప్రశాంత్ గౌడ్, గౌరీశంకర్, శ్రీశైలం యాదవ్, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS