*ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పంపిణీ*
*హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు*
( పయనించే సూర్యుడు అక్టోబర్ 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫరూక్నగర్ మండల పరిధిలోని మధురాపురం గంట్లవెల్లి కమ్మదనం సోలిపూర్ చిల్కమర్రి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పాఠశాల బ్యాగులను పంపిణీ చేయడం జరిగింది. మధురపురం పాఠశాలలో 33 బ్యాగులు గంట్లవెల్లి 120 కమ్మదానం 47 బ్యాగులు చిలకమర్రి 66 బ్యాగులు సోలిపూర్ 70 బ్యాగులు మొత్తం 336 బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహిస్తూ అవసరమైన విద్యm సామాగ్రిని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సర్పంచులు శివారెడ్డి కుమార్ లలిత కిరణ్ గౌడ్ కౌన్సిలర్ శిరీష అనిల్ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రగతి వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎండి ముజీబుల్లా శ్రీధర్ రెడ్డి రవి సత్యనారాయణ జనార్దన్ రెడ్డి ప్రగతి వెల్ఫేర్ సొసైటీ సీనియర్ ప్రోగ్రాం శంకర్ మురళీకృష్ణ ఎడ్యుకేషనల్ మేనేజర్ జగదీష్ కోఆర్డినేటర్లు జ్యోతి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.